తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిత్రపురి కాలనీ నూతన ప్రాజెక్ట్, భవిష్యత్ కార్యాచరణ గురించి సోమవారం జరిగిన కార్యక్రమం లో సభ్యులు వెల్లడించారు. త్వరలోనే భూమి పూజ ఉంటుందని అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ వెల్లడించారు. నూతన ప్రాజెక్ట్ SAPPHIRE SUITE’ కు సంబందించిన బ్రోచర్ ను విడుదల చేసారు. వల్లభనేని అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ “1994లో మొదటిసారి చిత్రపురి కాలనీ అనే ప్రాజెక్టు మొదలైంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అసోసియేషన్ అధ్యక్షులు మారుతున్నారు. అనుమతుల కోసం ప్రయత్నం చేయడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. అయితే ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్ కలగచేసుకున్న తర్వాతే పర్మిషన్ వచ్చిందని చెప్పడానికి గర్విస్తున్నాము. అయితే ఇప్పుడు రూ.166 కోట్లు అప్పులో ఉన్నాం. ఇక్కడ చాలా సమస్యలున్నాయి. వాటిని బయటకు చెప్పుకోలేం. కానీ ఎవరికీ ఇబ్బంది కలగకుండా పరిశమ్రలో కార్మికులు అందరికీ ఇళ్లు అందించాలనే ప్రయత్నంలో…