చంద్రబోస్‌ 15 ఏళ్ల నిరీక్షణకు తెర!

Chandra Bose's 15-year wait is over!

‘నాటు నాటు’ పాటకుగానూ అంతర్జాతీయ వేదికపై ఆస్కార్‌,గోల్డెన్ గ్లోబ్‌ అవార్డులు గెలుచుకున్న గీత రచయిత చంద్రబోస్‌ భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్నారు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో పంజా వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ జంటగా నటించి ’కొండపొలం’ చిత్రంలో ’ధం ధం ధం’ పాటకు ఉత్తమ గీత రచన విభాగంలో చంద్రబోస్‌ను జాతీయ పురస్కారం వరించింది. ఆయనకు దక్కిన తొలి నేషనల్‌ అవార్డ్‌ ఇది. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. ’ఆస్కార్‌, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు గెలుచుకుని రచ్చ గెలిచాను. ఇప్పుడు ’కొండపొలం’లో పాటతో జాతీయ పురస్కారం సాధించి ఇంట గెలిచాను. ఇంత కన్నా ఆనందం ఏముంటుంది. ఈ ఏడాదిలో జీవితమే సఫలమైనట్లు అనిపిస్తుంది. నా ఇన్నాళ్ల శ్రమ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినట్లయింది. ఈ జాతీయ అవార్డు గెలుచుకోవడమన్నది నా 15 ఏళ్ల…