బాలయ్య యాక్షన్‌ సీన్లతో థియేటర్‌ దద్దరలిల్సాందే..!

Balayya's action scenes make the theater roar..!
Balayya's action scenes make the theater roar..!
Spread the love

”అడవి బిడ్డ నేలకొండ భగవంత్‌ కేసరి ఈ పేరు శానా ఏళ్లు గుర్తుంటాది’ అంటూ టీజర్‌తో విపరీతంగా ఆకట్టుకున్నారు నందమూరి బాలకృష్ణ. ట్రైలర్‌ అయితే మరో లెవల్‌ . గత చిత్రాల మాదిరి కాకుండా డిపరెంట్‌ లుక్‌, మ్యానరిజంతో కనిపించారు బాలయ్య. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇందులో కాజల్‌ కథానాయిక. శ్రీలీల కీలక పాత్ర పోషించింది. అర్జున్‌ రాంపాల్‌ ప్రతినాయకుడు. అనిల్‌ కామెడీకి బాలయ్య మాస్‌ ఎలిమెంట్స్‌ కలిస్తే థియేటర్‌ దద్దరిల్లిపోవాల్సిందే. భారీ అంచనాల మధ్య శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఏమనుకుంటున్నారు అన్నది చూద్దాం. ఓవర్సీస్‌లో ప్రీమియర్‌ చూసిన కొందరు ‘బ్రో ఐ డోంట్‌ కేర్‌’… సినిమా సూపర్‌హిట్‌ అని అభిప్రాయ పడుతున్నారు. ఇది టిపికల్‌ బాలయ్య స్టైల్‌ సినిమా కాదు. అలాగే అనిల్‌ తరహా కథ కూడా కాదు. దర్శకుడు తన ఫార్ములాను పక్కనపెట్టి డీసెంట్‌ కమర్షియల్‌ సినిమా తీశాడు. అయితే సినిమాలో కొన్ని ఐడియాలు, భావోద్వేగాలు వర్కవుట్‌ కాలేదు. యాక్షన పార్ట్‌కు మాత్రం మేజారిటీ ఓట్లు పడతాయి. యాక్షన సీన్స థియేటర్‌ దద్దరిల్లాల్సిందే’’ అని ఓ నెటిజన తన అభిప్రాయాన్ని రాసుకొచ్చాడు. సినిమాను తప్పకుండా ఎంజాయ్‌ చేయొచ్చు. కొత్త బాలయ్యను చూస్తాం, ఇంటర్వెల్‌ సీన అదిరింది అని మరో నెటిజన రాసుకొచ్చాడు.