“జార్జిరెడ్డి, వంగవీటి’ వంటి వరుస విజయాలతో దూసుకెళ్తున్న వెర్సటైల్ యాక్టర్ సందీప్ మాధవ్ మరొక డిఫెరెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, రీసెంట్ గా వాల్తేరు వీరయ్య, వంటి సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించిన గ్లామరస్ బ్యూటీ కేథరిన్ థెరిసా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ మహా విష్ణువు మూవీస్, పల్లి పైడయ్య ఫిలిమ్స్ పతాకాలపై సోమ విజయ్ ప్రకాష్ నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ అశోక్ తేజ (ఓదెల రైల్వే స్టేషన్) ఫేమ్ దర్శకత్వంలో దావులూరి జగదీష్, పల్లి కేశవరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ప్రొడక్షన్ నంబర్ వన్’ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. *ఈ చిత్ర విశేషాలను నిర్మాతల్లో ఒకరైన దావులూరి జగదీశ్ తెలుపుతూ* “కేథరిన్, సందీప్ మాధవ్, కాంబినేషన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.…