-గుండెల మీద చేతులేసుకుని వచ్చేయొచ్చు ఈ సినిమాకి.. అంత బాగుంటుంది: విశ్వక్ సేన్ -సస్పెన్స్ తో కూడిన ఒక క్యూట్ విలేజ్ లవ్ స్టోరీ ఇది: నిర్మాత నాగవంశీ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఓ వైపు భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ చిన్న సినిమాలతో పెద్ద విజయాలను అందుకుంటుంది. దానికి ఉత్తమ ఉదాహరణ ‘డీజే టిల్లు’. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆ స్థాయిలో అలరించడానికి సితార సంస్థ సిద్ధమవుతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ‘బుట్ట బొమ్మ’. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్…