బబుల్‌గమ్ బూటీఫుల్ ఫిల్మ్ : గ్రాండ్ ప్రీ బుకింగ్ ఈవెంట్ లో హీరో అడివి శేష్

Bubblegum Bootyful Film: Hero Adivi Sesh in Grand Pre Booking Event

-బబుల్‌గమ్ ట్రైలర్‌ లో హిట్ కళ కనిపిస్తోంది. సుమ గారికి ఈ సినిమా ఎంత ప్రత్యేకమో.. నాకూ అంతే: హీరో సిద్ధు జొన్నలగడ్డ -ట్రైలర్‌లో రోషన్‌ నటన చూస్తే కొత్తవాడిలా అనిపించట్లేదు. రోషన్ విజయం సాధించాలని అందరూ కోరుకుంటారు: హీరో విశ్వక్ సేన్ -బబుల్‌గమ్ చిత్రంలో వుండే ఎమోషన్స్ ని అందరూ ఎంజాయ్ చేస్తారు: హీరో రోషన్ కనకాల ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్‌గమ్’. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీ…