మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా కథానాయిక కాగ, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వుంది. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపధ్యంలో చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన డడ్లీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. ఇది మీ తొలి తెలుగు సినిమా కదా.. ఈ ప్రయాణం గురించి చెప్పండి ? దర్శకుడు మెహర్ రమేష్, నేను పదేళ్ళుగా మంచి స్నేహితులం. లాక్ డౌన్ పిరియడ్ లో ఓ రోజు కాల్…