పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ గా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మలయాళం సూపర్ హిట్ మూవీకి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటించగా.. కీలక పాత్రలో రానా నటించాడు. ఈ సినిమా ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ ను స్టార్ ఇండియా దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనుండగా స్టార్ మా లో టెలికాస్ట్ కు సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా విడుదల అయిన అయిదు వారాల తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక స్టార్ మా లో కూడా కొంత గ్యాప్ తర్వాత టెలికాస్ట్ చేసే విధంగా అగ్రిమెంట్ అయ్యిందనే సమాచారం. ఈ…