నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్ నోవాలెట్ ఆడిటోరియమ్ వేదికగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సందర్బంగా… నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… ఈ రోజు ఇంతమంది అభిమానులు, నా తోటి నటీనటులు, నాతో పని చేసిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు జన్మను ఇచ్చిన తల్లి తండ్రులకు, నాకు ఇంతటి అభిమానాన్ని ఇచ్చిన మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకుంటాను. అలాగే నా కుటుంబం అయిన నిర్మాతలు, దర్శకులు, నటులు, కళాకారులు, సాంకేతిక బృందం, నా హాస్పిటల్ బృందం, హిందూపూర్ ప్రజలు, నా అభిమానులు అంత కలిసి ఈ వేడుకను ఇంత గొప్ప విజయం…