తెలంగాణ పల్లెల్లో వున్న సంప్రదాయం, కట్టుబాట్లు, కుటుంబం, బంధాలు, అనుబంధాలు, ఆచారాల గురించి చెప్పే కథలతో వస్తున్న సినిమాలకు టాలీవుడ్ లో మంచి ఆదరణ లభిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా ప్రేక్షకుల ముందుకొస్తున్న భావోద్వేగమయిన కథలు సహజంగానే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కుటుంబం కానీ, గ్రామం కానీ, లేదా ఎక్కడ అయినా, అందరూ కలిసి ఉంటే అదే ఒక ‘బలగం’ అవుతుంది అనే చెప్పే కథతో వచ్చిన తాజా చిత్రమిది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన ఈ ‘బలగం’ చిత్రంతో ‘జబర్దస్త్’ టీవీ షోతో బాగా పాపులారిటీ సాధించిన నటుడు వేణు ఎల్దండి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ఇందులో ముఖ్యమైన పాత్రలు పోషించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక గ్రామం లో ఈ సినిమా…