సూపర్ స్టార్ మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ చిత్రం ‘గుంటూరు కారం’ . శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. హై ఎక్స్‌పెక్టేషన్స్ నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజున రూ.94 కోట్ల వసూళ్లను సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్బంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో… నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘‘‘గుంటూరు కారం’ సినిమా సంక్రాంతికి జనవరి 12న రిలీజైంది. మేం ఊహించిన దాని కంటే గొప్ప రెస్పాన్స్ రావటం చాలా సంతోషంగా ఉంది. కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయి. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న సినిమా రీజనల్ తెలుగు సినిమా వచ్చింది. ప్రేక్షకులు ఎంకరేజ్…