మరో మహిళా ప్రాధాన్య పాత్రలో అనుష్క!

Anushka in another female lead role

మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్ గా నిలిచారు అనుష్కశెట్టి. ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’లో దేవసేన లాంటి పాత్రలతో మెప్పించిన ఆమె ఆ తరహాలోనే మరో పాత్ర చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకూ తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకే పరిమితమైన అనుష్క తాజాగా ఓ అడుగు ముందుకేసి మలయాళ ఇండస్టీల్రో కూడా అడుగు పెడుతున్నారు.’కథనార్‌ ది వైల్డ్‌ సోర్సెరర్‌’ టైటిల్‌తో రానున్న ఈ చిత్రంలో కీలక పాత్ర చేయడానికి అనుష్క గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. జయసూర్య హీరోగా నటించబోతున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. కేరళలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో అనుష్క పాత్ర ‘అరుంధతి’ తరహాలో ఉంటుందని సమాచారం. రోజిన్‌ థామస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 14 భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ…