‘మిషన్‌ రాణిగంజ్‌’గా అక్షయ్‌ సినిమా!

Akshay's movie as 'Mission Raniganj'!

‘ఓ మై గాడ్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో చాలా రోజులకు హిట్‌ కొట్టాడు స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ . ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేట్‌ ఇండియన్‌ రెస్క్యూ’ బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా కథానాయికగా నటిస్తుంది. 1989లో రాణిగంజ్‌ అనే మైనింగ్‌ ఏరియాలో జరిగిన ప్రమాదంపై ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ ప్రమాదంలో జస్వంత్‌ సింగ్‌ గిల్‌ అనే మైనింగ్‌ ఇంజనీర్‌ మైనింగ్‌లో చిక్కుకున్న 64 మందిని కాపాడారు. అతని జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రానుంది. ఇక కేసరి వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రం తరువాత అక్షయ్‌, పరిణీతి మళ్లీ కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి టిను సురేష్‌ దేశాయ్‌ దర్శకత్వం వహిస్తుండగా.. పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వశ్‌ భగ్నానీ నిర్మిస్తున్నాడు.…