అక్కినేని నాగేశ్వరరావు జీవితం, నటన రెండు నేటితరాలకు పాఠ్య గ్రంథాలని తెలంగాణా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్,ఆదర్శ ఫౌండేషన్, ఆర్ ఆర్ ఫౌండేషన్ నిర్వహణలో తెలంగాణా భాషా సాంసృతిక శాఖ సౌజన్యంతో అక్కినేని జీవన సాఫల్య పురస్కారాల ప్రధానోత్సవం హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నారెడ్డి మాట్లాడుతూ మీడియాలో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న వారికి దీక్ష, నిబద్ధత అవసరం అన్నారు. తర్వాత ప్రముఖ దూరదర్శన్ సీనియర్ న్యూస్ రీడర్,నంది అవార్డు గ్రహీత, హైదరాబాద్ సమయ్ హిందీ డైలీ న్యూస్ పేపర్ చీఫ్ ఎడిటర్ మహమ్మద్ షరీఫ్ తో పాటు సీనియర్ జర్నలిస్ట్లు బైసా దేవదాస్, వినాయక రావు,హనుమంత్ రావు,ఇమంది రామారావు,…