సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక అబుదాబి వేదికగా సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు జరగనుంది. ఈ సినీ పండగ ఐఫా 2024 కోసం ఇప్పటికే సెలబ్రిటీలు అక్కడికి చేరుకున్నారు. ఇక ఈ ఈవెంట్‌లో సీనియర్ నటి రేఖ నృత్య ప్రదర్శన ప్రత్యేకం కానుంది. ప్రతి ఏడాది తన డ్యాన్స్‌తో ఆకట్టుకునే రేఖ ఈ ఏడాది కూడా ప్రత్యేకత చాటుకోనున్నారు. 150 మంది డ్యాన్సర్లతో 22 నిమిషాల పాటు వేదికపై డ్యాన్స్ చేయనున్నారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ ఆనందం వ్యక్తంచేశారు. ‘ఐఫాకు ఎప్పుడూ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది అవార్డుల వేడుక మాత్రమే కాదు కళ, సంస్కృతి, ప్రేమను సూచిస్తుంది. ఐఫా వేదిక నాకు సొంత ఇంటిలా అనిపిస్తుంది. అందమైన ప్రదర్శనతో ఈ వేదికపై భారతీయతను చాటడం నాకు…