నటి హేమ తాత్కాలికంగా సినిమాల్లో నటించడం ఆపేసారా? ఈమధ్య కాలంలో ఏ సినిమాల్లోను కనిపించడం లేదు! ఇదే విషయం ఒక ఛానెల్ ఇంటర్వ్యూ లో తేల్చి చెప్పేసారు! ప్రస్తుతానికి సినిమాలకు గుడ్ బై అన్నారు. శివగామి లాంటి పాత్రలు వచ్చినా చేయనన్నారు. తన 14 వ ఏట నుంచి నటిస్తున్నా అని, ఇప్పుడు చిల్ అవుతున్న అని హేమ తెలిపారు. ఇన్నాళ్లు కష్టపడ్డాను. ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటున్న, నాకోసం చిల్ అవుతున్న, ఎవరికోసమో ఎందుకు కష్టపడాలి అని ఎదురు ప్రశ్నించారు హేమ. హేమ మంచి ఈజ్ వున్న నటి! ఏ పాత్రలో నైనా ఒదిగిపోయే నటి! ముఖ్యంగా వదిన, ఆడపడుచు పాత్రల్లో, అలాగే భార్య పాత్రల్లో అద్భుతంగా సహజంగా ఆయా పాత్రలకు వన్నె తెచ్చే నటి హేమ! అతడు సినిమాలో బ్రహ్మానందం జోడిగా అమాయక భార్య…