Aadipursh Movie : ‘ఆది పురుష్’కు ఐమాక్స్ స్క్రీన్ల సమస్య?!

Aadipursh Movie :

డార్లింగ్ ప్రభాస్ సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో ఇప్పటికే ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ప్రభాస్ మరో పాన్ ఇండియా చిత్రాలతో సందడి చేయడానికి ఎంతో హుషారుగా సమాయత్తమవుతున్నారు. అలాంటి సినిమాల్లో ‘ఆది పురుష్’ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణాన్ని ‘ఆది పురుష్’ టైటిల్ తో రూపొందించారు. మన ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తే.. సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడిగా నటించారు. కృతి సనన్ జానకి దేవి పాత్రలో నటించారు. ‘ఆది పురుష్’ కోసం ఇండియన్ సినిమాల్లో ఇప్పటి వరకు ఉపయోగించని సరికొత్త మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.కాగా.. ‘ఆది పురుష్’ చిత్రాన్ని త్రీడీ వెర్షన్‌, ఐ మాక్స్ లో రూపొందించి విడుదలకు రెడీ చేస్తున్నారని ఇప్పటిదాకా…