అన్ని రకాల ఎమోషన్స్‌తో కూడిన చిత్రం..`మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను` – హీరో శివ కంఠమనేని

A film with all kinds of emotions.. ``Madhurapudi Gramam Ane Nenu'' - Hero Siva Kanthamaneni

`అక్కడొకడుంటాడు` ఫేమ్ శివ కంఠ‌మ‌నేని హీరోగా న‌టించిన‌ హై ఓల్టేజ్ యాక్ష‌న్ డ్రామా `మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను`. క‌ళ్యాణ్ రామ్ “కత్తి” ఫేమ్ మల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క్యాథ‌లిన్ గౌడ హీరోయిన్‌గా న‌టించ‌గా మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ముప్పా వెంక‌య్య చౌద‌రి సార‌థ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప‌తాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. అక్టోబర్ 13న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా సినిమా విశేషాల గురించి హీరో శివ కంఠ‌మ‌నేని మీడియాతో ముచ్చటించారు. ఆ వివ‌రాలు.. `మ‌ధుర‌పూడి గ్రామం అనే నేను` అనే సినిమా ఎలా మొదలైంది? – నేను హీరోగా న‌టించిన‌ `అక్కడొకడుంటాడు` చిత్రం బీ, సీ సెంటర్లలో బాగా ఆడింది. ఆ సినిమాలోని ఓ…