2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో ’18 పేజెస్’ ఉంటుంది : హీరో నిఖిల్

2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో '18 పేజెస్' ఉంటుంది : హీరో నిఖిల్

‘కార్తికేయ-2′ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ’18 పేజెస్’. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పొయిటిక్ లవ్ స్టోరీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సినిమాకు రోజురోజుకు మంచి స్పందన లభిస్తున్న తరుణంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సందర్బంగా.. నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ… 18 పేజెస్ వన్ వీక్ పూర్తిచేసుకుంది. ఈ సక్సెస్ మీట్ పెట్టడానికి కారణం మా ఆనందాన్ని మీతో పంచుకోవాలని. కమర్షియల్ సినిమాలకే ఆడియన్స్ వస్తున్నారు అనుకునే తరుణంలో ఇది ఒక చాలా డీసెంట్ కథ, ఒక ఎమోషన్ ఉన్న కథ, మెయిన్ రైటింగ్ తో ముడిపడిన కథ ఇది. ఈ సినిమా మౌత్ టాక్ తో డే బై డే పెరుగెత్తుకుంటూ…