’96’, ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’, ‘కొత్త బంగారు లోకం’ కోవలో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమా  ఉంటుంది!

10th Classs Daires

– టీజర్ లాంఛ్‌లో దర్శకుడు ‘గరుడవేగ’ అంజి అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో బుధవారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు ‘హిప్ హాప్’ తమిళ, హీరో ఆర్య ట్విట్టర్ ద్వారా టీజర్ విడుదల చేశారు. రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రచయిత బీవీఎస్ రవి ఆవిష్కరించారు.…