హ్యాపీ బ‌ర్త్ డే టు వెర్స‌టైల్ యాక్ట‌ర్ తిరువీర్‌!

Happy birthday to versatile actor Thiruveer!

‘మిషన్ తషాఫి’లో తిరువీర్ క్యారెక్ట‌ర్‌ను అనౌన్స్ చేసిన జీ 5 తిరువీర్‌.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటూ విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఓ వైపు సినిమాల‌తో పాటు ఓటీటీ మాధ్య‌మంలోనూ తిరువీర్ రాణిస్తున్నారు. ఇప్పుడు టాప్ ఓటీటీ మాధ్య‌మాల్లో ఒక‌టైన జీ5 ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ ‘మిషన్ తషాఫి’లో ఆయ‌న ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. దానికి సంబంధించి జీ 5 అధికారిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ఎంగేజింగ్‌, థ్రిల్లింగ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ప్ర‌ణ‌తి రెడ్డి నిర్మాత‌. ఇప్ప‌టికే రెగ్యుల‌ర్ షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం శ‌ర‌వేగంగా పూర్తవుతుంది. ఇప్పుడు వెర్స‌టైల్ యాక్ట‌ర్ తిరువీర్ ఈ టీమ్‌లో జాయిన్ కావ‌టంపై…