అనతికాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. టి.జి. విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో నడుస్తున్న పీపుల్ మీడియా సంస్థ వరుస ఘన విజయాలతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలను నిర్మిస్తోంది. ప్రస్తుతం పదికి పైగా నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జూన్ 16న ‘ఆదిపురుష్’ విడుదలవుతున్న నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ ఆదిపురుష్ తో పాటు తమ బ్యానర్ లో రూపొందుతోన్న సినిమాల గురించి ఆసక్తికర విషయాల పంచుకున్నారు. ‘ఆదిపురుష్’ తెలుగు రైట్స్ తీసుకోవడానికి కారణం? ఆదిపురుష్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ విజువల్‌గా బాగుంది. ఇది ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని మేము భావించాము.…