‘హంట్’లో ఎమోషన్స్ అన్నీ ఉంటాయి : భరత్ ఇంటర్వ్యూ

'హంట్'లో ఎమోషన్స్ అన్నీ ఉంటాయి : భరత్ ఇంటర్వ్యూ

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. మహేష్‌ దర్శకత్వం వహించారు. ఇందులో తమిళ హీరో భరత్ ప్రధాన పాత్రలో నటించారు. బాయ్స్, ప్రేమిస్తే, యువసేన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన ఆయన… తొలిసారి స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశారు. ఇందులో ఆయనది పోలీస్ రోల్. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా భరత్ మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు… బాయ్స్, ప్రేమిస్తే, యువసేన చిత్రాలతో తెలుగులోనూ ఫేమస్ అయ్యారు మీరు? మరి తెలుగు చిత్రాల్లో నటించడానికి ఎందుకింత గ్యాప్ తీసుకున్నారు? భరత్: నా మెయిన్ స్ట్రీమ్ తమిళ్. సో… అక్కడి సినిమాల మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేశా. వరుసగా అవకాశాలు వచ్చాయి.…