విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్ మార్క్ మూవీ ‘సైంధవ్’ కు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో నటించనున్నారు. ఈ కీలక పాత్రల కోసం దర్శకుడు పెర్ఫార్మార్స్ ను ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఇటీవలె రుహాని శర్మ పాత్రను డాక్టర్ రేణు గా పరిచయం చేశారు. ఈరోజు ఈ సినిమాలో మరో కీలక పాత్రను పరిచయం చేశారు మేకర్స్. బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ ఆండ్రియా జెర్మియా ఈ చిత్రంలో జాస్మిన్ పాత్రలో నటిస్తున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్…