“వేటాడ‌తా” చిత్రం షూటింగ్ ప్రారంభం!!

"వేటాడ‌తా" చిత్రం షూటింగ్ ప్రారంభం!!

అంక‌య్య ఆర్ట్ క్రియేష‌న్స్ ప‌తాకంపై అనిత మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో అరుణ్‌, సృజ‌న‌ల‌ను హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ సురేష్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అంక‌య్య ఎమ్ నిర్మిస్తోన్న చిత్రం `వేటాడ‌తా. ఈ చిత్ర ప్రారంభోత్స‌వం ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో గ్రాండ్ గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్ర‌ముఖ నిర్మాత రామ‌సత్య‌నారాయ‌ణ తొలి స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సాయి వెంక‌ట్ క్లాప్ కొట్టారు. వైజాగ్ ఎక్స్ మేయ‌ర్ దాడి స‌త్య‌నారాయ‌ణ కెమెరా స్విచాన్ చేశారు. నాగుల‌ప‌ల్లి పద్మిని స్క్రిప్ట్ అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథులంద‌రూ సినిమా విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు. VETAADATHA Telugu Movie Opening ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో నిర్మాత అంక‌య్య ఎమ్ మాట్లాడుతూ…“మా బేన‌ర్ లో `మాయా మ‌హ‌ల్‌` మొద‌టి చిత్రం. మ‌రో రెండు…