యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కర్ణ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సనాతన క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై కళాధర్ కొక్కొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే స్వీయ నిర్మాణంలో హీరో గా నటిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్స్, టీజర్ ప్రేక్షకుల మెప్పు పొంది సినిమా పట్ల ఆసక్తి పెంచేసింది. జూన్ 23వ తేదీన ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. కంటెంట్ ఉండే చిత్రాలను ప్రోత్సహించడంలో ముందుండే దిల్ రాజు.. ఈ ట్రైలర్ రిలీజ్ చేసి యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెష్ చెప్పారు. యుద్ధం శరణం శిక్షామి, స్నేహం శూన్యం రక్ష్యామి, లోకం స్వార్థం ప్రక్షామి…
