పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , నాసా ఆధ్వర్యంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ కన్సర్ట్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , నాసా ఆధ్వర్యంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ కన్సర్ట్

నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. RRR సినిమా ‘నాటు నాటు’ పాటకు 150 టెస్లా కార్లు తో లైట్ షో నిర్వహించడం వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను టీజీ.విశ్వప్రసాద్ గారి అధ్వర్యంలో నార్త్‌ అమెరికన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్వహించారు. రీసెంట్ గా యంగ్ సెన్సేషనల్ సింగర్ రామ్ మిరియాలతో పలు చోట్ల మ్యూజిక్ కన్సర్ట్ లు నిర్వహించారు. ఈ షోస్ కి ఊహించని రీతిలో అనూహ్య స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ.విశ్వప్రసాద్ , నాసా ఆధ్వర్యంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తో ఇదే మాదిరిగా మ్యూజిక్ కన్సర్ట్ లను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియో ను…

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ‘డిక్కిలోన’ ఫేమ్ కార్తీక్ యోగి దర్శకత్వంలో సంతానం హీరోగా ‘వడక్కుపట్టి రామసామి’

People Media Factory Presents ‘Dikkiloona fame filmmaker Karthik Yogi directorial Santhanam starrer ‘Vadakkupatti Ramasamy’

‘గూఢచారి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పలు విజయాలను సాధించి తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. విట్ నెస్, సాల వంటి చిత్రాలను నిర్మించడం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అక్కడా కూడా తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు ‘వడక్కుపట్టి రామసామి’ పేరుతో తమిళంలో మూడో చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రం కోసం ‘డిక్కిలోన’తో బ్లాక్ బస్టర్ జోడీగా పేరు తెచ్చుకున్న నటుడు సంతానం, దర్శకుడు కార్తీక్ యోగితో చేతులు కలపడం విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్రియేటివ్ ప్రొడ్యూసర్ వి. శ్రీ నటరాజ్ మాట్లాడుతూ.. “పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో టి.జి.విశ్వప్రసాద్ మరియు కో-ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల వంటి దూరదృష్టిగల నిర్మాతలు ఉన్నారు. వీరు తెలుగులో అన్ని వర్గాల ప్రేక్షకులను…

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ: ఒక ఏడాదిలో రెండూ వందకోట్ల సినిమాలే!

With Karthikeya 2 and Dhamaka, People Media Factory delivered two hundred crore films back to back in the same year

కాలం బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. అలానే సినీ పరిశ్రమలో కూడా చాలా మార్పులు సంభవించాయి. ఓటిటి లో సినిమాలు చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కి రావడం తగ్గించేశారు అనుకున్న తరుణంలో బింబిసార, సీతారామం వంటి సినిమాలు, ఒక మంచి సినిమా చేస్తే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు అని నిరూపించాయి. 2022 లో ట్రిపుల్ ఆర్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్, భీమ్లా నాయక్, ఆచార్య వంటి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలలో కొన్ని బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ రాబట్టాయి. ట్రిపుల్ ఆర్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్, భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ వంటి సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరాయి. ఈ సినిమాలు వందకోట్ల క్లబ్ లో చేరడం అంత ఆశ్చర్యపడాల్సిన…