నేచురల్ స్టార్ నాని # Nani30 ప్రారంభం

Natural Star Nani, Mrunal Thakur, Shouryuv, Vyra Entertainments #Nani30 Launched Grandly

నేచురల్ స్టార్ నాని 30వ చిత్రానికి నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించనున్నారు. మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై భారీ ఎత్తున, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఈ సినిమా ఈరోజు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్‌ కొట్టగా.. అశ్వినీదత్ కెమెరా స్విచాన్ చేశారు. బుచ్చిబాబు, కిషోర్ తిరుమల, హను రాఘవపూడి, వశిష్ట, వివేక్ ఆత్రేయ కలిసి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. అంతకుముందు విజయేంద్ర ప్రసాద్ ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి మేకర్స్‌కి స్క్రిప్ట్‌ను అందజేశారు. పలాస కరుణ్ కుమార్, గిరీష్ అయ్యర్, దేవకట్టా, చోటా కె నాయుడు, సురేష్ బాబు, దిల్ రాజు, 14 రీల్స్ గోపి- రామ్ ఆచంట, ఎకె అనిల్ సుంకర, మైత్రి రవి,…