‘కన్నప్ప’ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

Kannappa's Release Date Unveiled, Arriving On June 27th: Vishnu Manchu's Dream Project Receives Blessings from UP CM Yogi Adityanath
Spread the love

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీం ప్రాజెక్టుగా కన్నప్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కన్నప్పపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. కన్నప్ప నుంచి వచ్చిన పోస్టర్లు టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. మరీ ముఖ్యంగా పాటలు అయితే కన్నప్పపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి.
ప్రస్తుతం కన్నప్ప టీం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. మోహన్ బాబు, విష్ణు, ప్రభుదేవా వంటి వారు యూపీ సీఎంను కలిశారు. కన్నప్ప టీంను యూపీ సీఎం సాదర స్వాగతాలతో ఆహ్వానించారు. యూపీ సీఎం ఆతిథ్యానికి కన్నప్ప టీం ఫిదా అయింది. ప్రముఖ చిత్రకారుడు రమేష్ గొరిజాల గీసిన చిత్రపటాన్ని యూపీ సీఎంకు మోహన్ బాబు బహూకరించారు. అనంతరం కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను యూపీ సీఎం ఆదిత్య నాథ్ రిలీజ్ చేసి అభినందించారు.
జూన్ 27న కన్నప్ప చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు కన్నప్ప సినిమా నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి భారీ తారాగణం నటించిన సంగతి తెలిసిందే.

Related posts

Leave a Comment