యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ శౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘రంగబలి’ వస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ తో పాటు మొదటి రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. హీరో తన ఊరు పై తనకు ఉన్న అభిమానానికి గల కారణాన్ని చెప్పడంతో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. హీరో తండ్రి మెడికల్ షాప్ నడుపుతుండగా, తను స్నేహితులతో తిరుగుతూ కాలం గడిపేస్తుంటాడు. ఊర్లో ఓ డాక్టర్ తో ప్రేమలో పడతాడు. స్థానికంగా వున్న నాయకుడికి ఫాలోవర్ గా ఉంటాడు. అయితే వారి మధ్య శత్రుత్వం ఏర్పడి గ్రామంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి.…