సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం నరకాసుర. పలాస ఫేమ్ రక్షిత్ హీరోగా నటించిన ఈ మూవీ టీజర్ విడుదల అయింది.సెబాస్టియన్ డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. ఈ సందర్బంగా కోరియోగ్రాఫేర్ విజయ్ యాక్షన్ డైరెక్టర్ రాబిన్ సుబ్బు మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ ధన్యవాదాలు. రక్షిత్ గారితో పలాస మూవీ చేశాను. ఆ మూవీ లాగానే ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధిస్తుందనుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన సెబాస్టియన్ గారికి థాంక్స్.. అన్నారు. నిర్మాత శ్రీనివాస్ గారు మాట్లాడుతూ .. మా టీజర్ లాంచింగ్ కు విచ్చేసిన అతిథులకు ధన్యవాదాలు. ఈ సినిమాలోని ఆర్టిస్టులంతా అద్భుతంగా చేసారు. సెబాస్టియన్ గారు బాగా డైరెక్ట్ చేసారు. డీవోపీ నాని గారి వర్క్ చాల బావుంది. మేకింగ్ టైం…