గీతానంద్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్’. ఏ కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్ సేన్ టీజర్‌ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో గీతానంద్, నటుడు ఆదిత్య మీనన్, దర్శకుడు దయానంద్, నిర్మాత రవి కస్తూరి, మ్యూజిక్ డైరెక్టర్ నవాబ్ గ్యాంగ్, అశ్విన్ – అరుణ్, సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. మ్యూజిక్ డైరెక్టర్స్ అశ్విన్ – అరుణ్ మాట్లాడుతూ ‘‘ముందుగా హీరో గీతానంద్, దర్శకుడు దయానంద్, నిర్మాత రవిగారికి థాంక్స్. ఈ సినిమాలో ఓ రొమాంటిక్ ట్రాక్‌ను కంపోజ్ చేశాం. త్వరలోనే పాటలు…