‘కాలింగ్ సహస్త్ర’లో డిఫరెంట్ సుధీర్‌ని చూస్తారు: ‘కలయా నిజమా..’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్‌

‘కాలింగ్ సహస్త్ర’లో డిఫరెంట్ సుధీర్‌ని చూస్తారు: 'కలయా నిజమా..' సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్‌

అటు బుల్లి తెర ఇటు సిల్వ‌ర్ స్క్రీన్‌పై త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ సుడిగాలి సుధీర్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు క‌టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డాలిశ్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం నుంచి బుధ‌వారం ‘కలయా నిజమా..’ అనే లిరికల్ సాంగ్‌ను మీడియా మిత్రులు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. కె.ఎస్‌.చిత్ర మాట్లాడుతూ (వీడియో ద్వారా) ‘‘కాలింగ్ సహస్త్ర’ ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాలో ‘కలయా నిజమా..’ అనే మెలోడి సాంగ్ పాడాను. చాలా చక్కటి సాంగ్. చాలా రోజుల తర్వాత మంచి మెలోడీ సాంగ్ పాడినట్లు అనిపించింది.…