‘కస్టడీ’ చిత్రం నుంచి అరవింద్ స్వామి పోషిస్తున్న రాజు క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్

‘కస్టడీ’ చిత్రం నుంచి అరవింద్ స్వామి పోషిస్తున్న రాజు క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన చిన్న గ్లింప్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కృతి శెట్టి పాత్ర పోస్టర్ కూడా క్యురియాసిటీని పెంచింది. ఈ రోజు మేకర్స్ ట్యాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి పాత్ర పోస్టర్‌ను విడుదల చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. అరవింద్ స్వామి ఈ చిత్రంలో రాజు అలియాస్ రాజు (Raju aka Raazu) పాత్ర పోషిస్తున్నారు. అతని లుక్ చాలా పవర్ ఫుల్ గా వుంది. సంకెళ్లతో బార్స్ వెనుక కనిపిస్తున్నారు. అరవింద్ స్వామి ఈ చిత్రంలో బలమైన పాత్ర పోషిస్తున్నారని ఈ పోస్టర్ చూస్తే అర్ధమౌతోంది. ఈ ఫెరోసియష్ లుక్ ఈ…