‘విరూపాక్ష’ సూపర్‌హిట్ అవుతుంది: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్

ఏప్రిల్ 21న వస్తోన్న 'విరూపాక్ష' సూపర్‌హిట్ అవుతుంది: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఆదివారం (ఏప్రిల్ 16) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏలూరులోని సీఆర్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో.. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘అమ్మా ఐ లవ్యూ.. ఈ సినిమాను నీ కోసం, వైష్ణవ్ కోసం చేశాను…