ఇంటివాడు కాబోతున్న నటుడు త్రిగుణ్!

Actor Trigun is going to be a housewife!
Actor Trigun is going to be a housewife!
Spread the love

‘కథ’ అనే చిత్రంతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన త్రిగుణ్ పీవీఎస్ గరుడ వేగ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, డియర్ మేఘలాంటి చిత్రాల్లో నటించారు. అలాగే ఆర్జీవి తెరకెక్కించిన ‘కొండా’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు… తెలుగు ప్రేక్షకులందరికీ చాలా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈ నటుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఆదివారం సెప్టెంబర్ 3న పెళ్లికి ముస్తాబు అవుతున్నారు. నివేదిత అనే అమ్మాయితో పెద్దలు కుదిర్చిన వివాహాన్ని కుటుంబం, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా జరుపుకుంటున్నారు. శనివారం సాయంత్రం ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్. ఆదివారం ఉదయం వెడ్డింగ్ వేడుక జరపుకుంటున్నారు. వేదిక వచ్చేసి శ్రీ సెంతుర్ మహల్, అవినాశి, తిరుపుర్, తమిళనాడులో జరగుతుంది. ఈ వేడుకకు సినిమా పరిశ్రమ ప్రముఖులు, రాజకీయా నాయకులు చాలా మంది సెలబ్రెటీలు హాజరు కానున్నారు. అరుణ్ అదిత్ గా తెలుగు, తమిళ్ లో కొన్ని సినిమాలు తీసిన ఈయన తరువాత 2022లో తన పేరును త్రిగుణ్ గా మార్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు.