1990’s లో సామాజిక స్థాయి బేధాలు, పరువు హత్యలు ప్రేమికుల పాలిట శాపాలుగా నడుస్తున్న కాలంలో, కట్టుబాట్లకి, సాంప్రదాయాలకి, ప్రేమ అతీతమైనదని అమ్మవారే సాక్షి గా నిలిచి.. గెలిపించిన సరి కొత్త ప్రేమ కథ ఇది. అన్విక ఆర్ట్స్ వారి ఎర్రగుడి (అమ్మవారి సాక్షిగా అల్లుకున్న ప్రేమ కథ) చిత్ర ప్రారంభోత్సవం డిసెంబర్ 19వ తేదీ సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. హీరో వెంకట్ కిరణ్, హీరోయిన్ శ్రీజిత ఘోష్ లపై చిత్రీకరించిన ముహూర్త దృశ్వానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రభు క్లాప్ కొట్టగా, ప్రొడ్యూసర్ జెవిఆర్ కెమెరా స్విచాన్ చేసారు. సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తొలి షాట్ కి దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. ఎర్రగుడి సినిమా లవ్, సెంటిమెంట్, స్పిరిట్యువల్ అంశాలతో ఉంటుంది. 1975 ప్రాంతంలో కథ…