‘ఎన్టీఆర్ 30’ కోసం హైదరాబాద్ కు చేరుకున్న బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్!

'ఎన్టీఆర్ 30' కోసం హైదరాబాద్ కు చేరుకున్న బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా ‘NTR 30’ పనులు చకచకా నడుస్తున్నాయి. ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ ఒకటి డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు హైదరాబాద్‌కు చేరుకుందట జాన్వీ కపూర్. ప్రస్తుతం ఆమె రామోజీ ఫిలిం సిటీలో ఉన్నట్లు సమాచారం. ”అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి.. తను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా’’ -అంటూ ‘ఎన్టీఆర్ 30’ కోసం వదిలిన 30 సెకెన్ల టీజర్‌ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పటికే…