‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటించింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో ‘ఉగ్రం’పై అంచనాలని పెంచాయి. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ‘ఉగ్రం’ విశేషాలని మీడియాతో పంచుకున్నారు హీరోయిన్ మిర్నా మీనన్. మీ ప్రయాణం గురించి చెప్పండి ? ‘ఉగ్రం’ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? నేను డెవలపర్ ని. దుబాయి లో ఇంజనీర్ గా పని చేశాను. తర్వాత కేరళ వచ్చి పని చేశాను. కానీ చిన్నప్పటి నుంచి సినిమా ఇష్టం. యాక్టర్ అవ్వాలని వుండేది. ఒక రోజు దర్శకుడు…