ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం “రాజు గారి కోడిపులావ్” కుటుంబ కథా ‘వి’చిత్రం అనేది ట్యాగ్. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శివ కోన ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ట్రైలర్ విడుదల అవడంతో సోషల్ మీడియాలో మంచి బజ్ కనిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగించుకుని ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ రమ్య గిరీష్ మాట్లాడుతూ.. తనకు తెలుగులో మొదటి సినిమా అవకాశమిచ్చిన డైరెక్టర్ శివకోనకి ధన్యవాదాలు తెలిపారు.…