‘తండేల్’ మూవీ హిట్ కావడంపై అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నాగ చైతన్యను చూస్తుంటే తండ్రిగా గర్వంగా ఉందని ఆయన ఆ పోస్టులో రాసుకొచ్చారు. ‘తండేల్’ సినిమా విజయం సాధించడంపై చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. సాయి పల్లవిని డామినేట్ చేసిన ఏకైక హీరో ఈ మేరకు ఆ పోస్టులో.. ఈ సినిమా కోసం నువ్వు సవాళ్లు ఎదుర్కోవడం, నటుడిగా పరిధులు దాటడం చూశాను. ‘తండేల్’ సినిమా మాత్రమే కాదు, నీ ప్యాషన్, కష్టానికి నిదర్శనం అని నాగ చైతన్యను మెచ్చుకున్నారు. అక్కినేని అభిమానులు అంతా కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడూ మా వెన్నంటే ఉన్నారని తెలిపారు. ఫ్యాన్స్ ప్రేమకు, సపోర్టుకు ధన్యవాదాలు అని చెప్పారు. అలానే సాయి పల్లవిపై కూడా ప్రశంసలు కురిపించారు. దేవిశ్రీ ప్రసాద్ నువ్వు రాకింగ్. రైజింగ్ స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి, ‘తండేల్’ టీమ్‌కు, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసుకు కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు. ప్రస్థుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, నాగ చైతన్య ఇద్దరూ పోటీపడి మరీ నటించారని అంటున్నారు. సినిమా అంతా ఒక ఎత్తు అయితే, చివరి 20 నిమిషాల సినిమాను దర్శకుడు మరో లెవెల్‌కు తీసుకువెళ్లారని చెబుతున్నారు. క్లైమాక్స్‌లో నాగ చైతన్య నటన అందర్నీ కత్తిపడేసిందని కితాబు ఇస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్, దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం నెక్స్ట్ లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చైతన్యను చూస్తుంటే గర్వంగా ఉంది : నాగార్జున
