నా భర్తతో పెళ్లి మాత్రమే అయింది : సాక్షి అగర్వాల్‌

I only got married to my husband: Sakshi Agarwal
Spread the love

నటి సాక్షి అగర్వాల్‌ జనవరి 2, 2025న తన చిరకాల స్నేహితుడు నవనీత్‌ను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం గోవాలో జరిగింది.పెళ్లి తర్వాత కూడా సాక్షి అగర్వాల్‌ సినిమాల్లో నటిస్తున్నారు. సాక్షి అగర్వాల్‌ తాజాగా ఓ ఇంటర్య్వూలో తన వైవాహిక జీవితంపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉండటం వల్ల ఇంకా వైవాహిక జీవితం ప్రారంభించలేదని సాక్షి చెప్పుకొచ్చింది. పెళ్లి మాత్రమే అయిందని, సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండటం వల్ల వైవాహిక జీవితానికి టైమ్‌ కేటాయించలేదని ఈ భామ తెలిపింది. అయితే వాలెంటైన్స్‌ డే కోసం తమిళనాడు అంతా ట్రిప్‌ ప్లాన్‌ చేసుకున్నామని, ఆ తర్వాత యూరప్‌లో హనీమూన్‌కి వెళ్లాలని అనుకుంటున్నామని సాక్షి అగర్వాల్‌ చెప్పుకొచ్చింది.

Related posts

Leave a Comment