‘డబుల్‌ ఇస్మార్ట్‌’ కోసం రామ్‌ ఫీట్లు..

Ram Feet for 'Double Smart'..
Spread the love

థియేటర్లలో మాస్‌ ప్రేక్షకులను ఇంప్రెస్‌ చేయాలంటే హీరో ఏదో ఒక రిస్కీ ఫీట్‌ చేయాల్సిందే. మూవీ లవర్స్‌ కోసం అలాంటి రిస్క్‌ చేసే యాక్టర్లలో ఒకడు రామ్‌ పోతినేని. పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ నటించిన చిత్రం డబుల్‌ ఇస్మార్ట్‌… బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సీక్వెల్‌ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రంలో కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. డబుల్‌ ఇస్మార్ట్‌ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా పూరీ టీం ఏదో ఒక అప్‌డేట్‌తో అభిమానులు, సినీ జనాల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా ఈ సినిమా కోసం బాలీ (ఇండోనేషియా)కి వెళ్లి తక్కువ టైంలో తప్పనిసరి పరిస్థితుల్లో 18 కిలోలు బరువు తగ్గానని చెప్పాడు రామ్‌. కాగా ఈ మూవీలో గన్స్‌, రౌడీలతో స్టయిలిష్ యాక్షన్‌ పార్టు ఉండబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్‌ చెప్పకనే చెబుతున్నాయి. దీని కోసం రామ్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. డబుల్‌ ఇస్మార్ట్‌ బీటీఎస్‌ స్టిల్స్‌ చూస్తే ఈ విషయం విూకే అర్థమవుతుంది. ఈ మూవీని నైజాంలో ప్రైమ్‌ షో ఫిలిమ్స్‌ విడుదల చేస్తుండగా.. తమిళనాడులో పాపులర్‌ ఫిలిం డిస్ట్రీబ్యూషన్ కంపెనీ శక్తి ఫిలిం ఫ్యాక్టరీ విడుదల చేస్తోంది. ఇప్పటికే ధిమాక్కిరికిరి డబుల్‌ ఇస్మార్ట్‌ టీజర్‌, ట్రైలర్‌ నెట్టింట టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నాడు. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్‌ మ్యూజిక్‌ లేబుల్‌ ఆదిత్య మ్యూజిక్‌ సొంతం చేసుకుంది.

Related posts

Leave a Comment