‘పుష్ప-2’పై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు

Megastar's key comments on 'Pushpa-2'
Spread the love

విశ్వక్‌ సేన్‌ నటించిన ‘లైలా’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌గా వచ్చిన చిరంజీవి ‘పుష్ప-2’పై కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై చిరంజీవి మాట్లాడుతూ..అభిమానం వేరు, వ్యక్తిగతం వేరు. ఓ వ్యక్తి మన మనిషి కాదని, దూరం పెట్టడం సరి కాదని చిరంజీవి వ్యాఖ్యానించారు.ఇండస్ట్రీలో హీరోలంతా ఒకటే అని, ఇండస్ట్రీలో అందరూ ఒకటే అని మేసేజ్‌ని ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మన ఇమేజ్‌, ఫ్యాన్‌ బేస్‌ పెరగాలంటే మనం చేసే సినిమా ఇస్తుంది తప్ప.. మనల్ని మనం దూరం చేసుకోవడం కాదంటూ హీరోలకు హితవు పలికారాయన. అలాగే ‘పుష్ప 2’ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. దానికి నేను గర్విస్తానని. ఇండస్ట్రీలో ఒక సినిమా బాగా ఆడింది అంటే ప్రతి ఒక్కరూ హర్షించాలని చిరంజీవి కోరారు. ఓ సినిమా హిట్‌ అయితే ఎంతో మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.

Related posts

Leave a Comment