మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ ‘విశ్వంభర’ నుంచి హనుమంతుడి ప్రేమ & భక్తితో నిండిన ఫస్ట్ సింగిల్ – రామ రామ సాంగ్ రిలీజ్

Megastar Chiranjeevi, Vashishtha, UV Creations' 'Vishvambhara' releases first single filled with love & devotion to Lord Hanuman - Rama Rama song
Megastar Chiranjeevi, Vashishtha, UV Creations' 'Vishvambhara' releases first single filled with love & devotion to Lord Hanuman - Rama Rama song
Spread the love

మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విశ్వంభర. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ సంవత్సరం మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలలో ఒకటి. ఇప్పటికే పోస్టర్లు, టీజర్ భారీ అంచనాలను నెలకొల్పాయి. ప్రతిష్టాత్మక యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్ ని మేకర్స్ ప్రారంభించారు.
హనుమాన్ జయంతి శుభ సందర్భంగా, మేకర్స్ ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ రామ రామ ను రిలీజ్ చేశారు. ఇది హనుమంతునికి శ్రీరాముడి పట్ల ఉన్న అచంచలమైన ప్రేమ, భక్తిని అందంగా చూపించే ఘన నివాళి.
ఈ పాట సోల్ ఫుల్ ఫీమేల్ వాయిస్ తో ప్రారంభమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి పవర్ ఫుల్ వాయిస్ “జై శ్రీ రామ్” అనే నినాదాన్ని ప్రతిధ్వనిస్తుంది. శ్రీరాముడు, సీతా కళ్యాణం వేడుకల నేపథ్యంలో సాంగ్ విజువల్ ఫీస్ట్ లా వుంది.
హృదయాన్ని హత్తుకునే క్షణంలో హీరో పవిత్ర ఉత్సవానికి శ్రీ హనుమంతునిని ఆహ్వానిస్తాడు. ఈ పాటలో భావోద్వేగం, భక్తిశ్రద్ధను మరింతగా పెంచుతుంది. మొత్తం పాట ఓ గ్రాండ్ సెటప్‌ లో చిత్రీకరించారు. ఇది ఆధ్యాత్మిక సంప్రదాయాల సారాన్ని అద్భుతంగా చూపించింది.
మ్యూజికల్ జీనియస్ ఎం.ఎం. కీరవాణి, ఆధ్యాత్మిక, దైవిక శక్తితో నిండిన అద్భుతమైన సాంగ్ కంపోజ్ చేశారు. లెజెండరీ సింగర్ శంకర్ మహాదేవన్, సింగర్ లిప్సిక ఈ ట్రాక్‌కు తమ ఎనర్జిటిక్ వోకల్స్ అందించారు. లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి భక్తి, సాంస్కృతిక గొప్పతనాన్ని కవితాత్మకంగా అందించారు.
చిరంజీవి చరిస్మాటిక్ ప్రజెన్స్ తో అదరగొట్టారు. గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించారు. హనుమంతుడిగా అలంకరించబడిన పిల్లల ప్రజెన్స్ భక్తిని జోడిస్తుంది. హనుమాన్ జయంతికి ఇది పర్ఫెక్ట్ సాంగ్.
తన బ్లాక్‌బస్టర్ ఫస్ట్ మూవీ బింబిసారతో చెరగని ముద్ర వేసిన దర్శకుడు వశిష్ట, విశ్వంభర ని అత్యద్భుతంగా చిత్రీకరిస్తున్నారు, దీనిని ఆయన తన అత్యంత ప్రతిష్టాత్మకమైన డ్రీం ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, కునాల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి డీవోపీ చోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్ ఎఎస్ ప్రకాష్.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డిఓపి: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో