మహేశ్‌-రాజమౌళి చిత్రంపై భారీ అంచనాలు

Huge expectations on Mahesh-Rajamouli's film
Spread the love

తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రాలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు – రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ హైప్‌ ఉంది. కాగా ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ముఖ్యపాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా నటిస్తున్నారట. ఆస్కార్‌ అవార్డు గ్రహిత కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని నిర్మాత కె.ఎల్‌ నారాయణ ఇంచుమించు రూ. 1,000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారట. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ నుండి, తాజాగా మొదటి భాగం విడుదలకి సంబంధించి ఓ వార్త వైరల్‌ అవుతుంది. రిపోర్ట్‌ ప్రకారం, ఈ చిత్రాన్ని మార్చి 25, 2027 న విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు- ఫిలిం సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు రెండో భాగాన్ని 2029 లో విడుదల చేయాలనుకుంటున్నారట. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రజంట్‌ ఈ వార్త వైరల్‌ అవుతుంది. అంతే కాదు ప్రస్తుతానికి ఆ డేట్‌నే టార్గెట్‌గా పెట్టుకొని సినిమా పనులు కంప్లీట్‌ చేస్తున్నారట. ఇక దీనిపై మరింత క్లారిటీ రావడం విషయం పక్కన పెడితే.. ఈ న్యూస్‌ పై కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంకా సినిమా నుండి ఎలాంటి అప్‌ డేట్‌ కూడా రాలేదు అప్పుడే విడుదల తేదీనా? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే డేట్‌ లాక్‌ చేసినా, జక్కన్న సినిమాలు ఎన్నిసార్లు రిలీజ్‌ డేట్‌లు మార్చుకుంటాయనేది మనకి తెలియంది కాదని వాపోతున్నారు.

Related posts

Leave a Comment