‘ఇమ్మోర్టల్’ నుంచి ‘షీ ఈజ్ మై’ సాంగ్ రిలీజ్

'She Is My' song released from 'Immortal'
'She Is My' song released from 'Immortal'
Spread the love

మల్టీ ట్యాలంటెడ్ జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న డార్క్ పాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్’ మరియప్పన్ చిన్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘ఇమ్మోర్టల్’ నుంచి  రొమాంటిక్ మెలోడీ ‘షీ ఈజ్ మై’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు సామ్ సీఎస్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అరవింద్ శ్రీనివాస తన వోకల్స్ పాటకు ప్రాణం పోయగా, రాజశ్రీ సుధాకర్ రాసిన సాహిత్యం ప్రేమలోని భావోద్వేగాలను అందంగా పలికించింది. ఈ పాటలో జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్‌ల మధ్య కెమిస్ట్రీ చాలా ఆసక్తికరంగా వుంది. మనసును హత్తుకునే ట్యూన్, లిరిక్స్‌తో ‘షీ ఈజ్ మై’ సంగీత ప్రియులను ఆకట్టుకునే మెలోడీగా నిలిచింది.
నటీనటులు : జివి ప్రకాష్ కుమార్, కయదు లోహర్, TM కార్తీక్, కుమార్ నటరాజన్, లొల్లు సభ మారన్, ఆదిత్య కతిర్, అర్షు మహర్జన్, పెమ త్సంచో, సునీతా శ్రేష్ఠ
బ్యానర్: ఎకె ఫిల్మ్ ఫ్యాక్టరీ
రచన,  దర్శకత్వం: మరియప్పన్ చిన్న
నిర్మాత: అరుణ్‌కుమార్ ధనశేఖరన్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అరుణ్ రాధాకృష్ణన్
సంగీతం: సామ్ సిఎస్
ఎడిటర్: రాజేష్ ఎం
ఆర్ట్ డైరెక్టర్: శివశంకర్
స్టంట్స్ : ఆర్.శక్తి శరవణన్, జి.ఎన్.మురుగన్
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న
కొరియోగ్రఫీ : ఎం. షరీఫ్, శబరీష్
కాస్ట్యూమ్ డిజైనర్: వినోద్ సుందర్, తమిళ్సెల్వన్ UK
PRO: వంశీశేఖర్