వైభవంగా కూన సంతోష్‌కుమార్ జన్మదిన వేడుకలు

Koona Santosh Kumar's birthday celebrations held grandly.
Koona Santosh Kumar's birthday celebrations held grandly.
Spread the love

ఎల్బీనగర్, జూలై 28 (టైమ్స్ ప్రతినిధి) : కొత్తపేట డివిజన్ న్యూనాగోల్ కాలనీకి చెందిన కూన సంతోష్ కుమార్ గుప్తా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలోని లూస్ కాస్టిల్ ఫామ్ హౌస్ లో సోమవారం రాత్రి బంధువులు స్నేహితుల మధ్య జన్మదిన ఈ జన్మదిన వేడుకలు ఎంతో అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ కేక్ కట్ చేశారు. బంధుమిత్రులు ఆయనను గజమాలతో సత్కరించి శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బంధుమిత్రులకు ఆయన విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బిజెపి అధికార ప్రతినిధి ఎలిమినేటి జంగారెడ్డి, టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కటకం సుభాష్, బిజెపి నాయకుడు ముత్యాల సాయిబాబానేత, జిజేఆర్ ప్రతినిధులు గుర్రాల శ్రీకాంత్ రెడ్డి, జి.శశిధర్ రెడ్డి, వల్లాల మురళి, రాచూరి సుధీర్ కుమార్ గుప్తా, కాటం రఘు, వికాస్, బద్రి, రాహుల్, వసంత్, బన్నీ, లక్కీ, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.