‘సలార్’ పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. డిసెంబర్ 22 కోసం ఎదురుచూస్తున్న అభిమానుల అంచనాలని మరింతగా పెంచేస్తూ.. ఈ చిత్రంపై ఇప్పుడు ఓ బిగ్గెస్ట్ రూమర్ వినిపిస్తుంది. సలార్, క్రేజీఎఫ్‌కి లింక్ వుందని ఇప్పటికే కథనాలు వచ్చాయి. టీజర్ లో కూడా కొన్ని పోలికలు కనిపించాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’ యూనివర్స్ తో ముడిపెడుతూ ‘సలార్’ కథని రాసుకున్నారని వినిపించింది. అయితే ఈ రూమర్స్‌ను నిజం చేస్తూ.. ఇక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది. దీపావళి కానుకగా ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సలార్’ ట్రైలర్‌ను డిసెంబర్ 01 రాత్రి 7 గంటల 19 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఈ ట్రైలర్ టైంకి.. కేజీఎఫ్2 క్లైమాక్స్‌కి ఓ సంబంధం ఉందని సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్‌గా మారింది. కేజీఎఫ్ 2 క్లైమాక్స్‌లో రాఖీబాయ్ తన వద్ద ఉన్న బంగారంతో సముద్రంలో ఓ పెద్ద షిప్‌పై వెళ్తుంటాడు. కాగా ఆ షిప్ స్టీరింగ్ ఏరియాలో వివిధ టైమ్‌లైన్స్‌కు సంబంధించిన నాలుగు గడియారాలు అంటాయి. అందులో ఒక గడియారంలో టైమ్ సరిగ్గా 7:19 నిమిషాలని ఉంటుంది. అయితే ‘సలార్’ ట్రైలర్ టైం కూడా 7 గంటల 19 నిమిషాలకు విడుదల మేకర్స్ చేప్పడంతో సలార్‌కు, రాఖీ భాయ్‌కి మధ్య ఖచ్చితంగా ఏదో సంబంధం ఉందని ప్రభాస్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కాగా దీనిపై క్లారిటీ రావాలంటే ‘సలార్’ మూవీ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే….!
Related posts
-
W/O అనిర్వేష్ చిత్ర బృందాన్ని అభినందించిన హీరో అల్లరి నరేష్.
Spread the love గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర... -
Hero Allari Naresh Congratulates the Team of W/O Anirvesh
Spread the love Under the banner of Gajendra Productions by Venkateswarlu Merugu, Sri Shyam Gajendra, presented by... -
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ...