‘గద్దర్’ సినిమా అవార్డులను ఉర్దూ భాషా చిత్రాలకు కూడా విస్తరించాలి

'Gaddar' film awards should be extended to Urdu language films as well
Spread the love

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తెలుగు సినిమాల్లో ప్రముఖల కృషిని గౌరవించేందుకు ‘గద్దర్’ సినిమా అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డులు చిత్రపరిశ్రమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కళాభిమానులందరిలో హర్షాతిరేకాలను కలిగించింది. అయితే, ఉర్దూ సినిమా పరిశ్రమకు చెందిన సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అవార్డులను ఉర్దూ భాషా చిత్రాలకు కూడా విస్తరించాలని. ప్రతి సంవత్సరము 2014 నుండి 2023 వరకు మూడు ఉత్తమ తెలుగు చిత్రాలను గౌరవించినట్లుగానే, ఉర్దూ సినిమాని కూడా గౌరవిం చాలని కోరుతున్నారు కనీసం ఒక్క ఉర్దూ సినిమాకైనా సంవత్సరానికి ఒక అవార్డు ఇచ్చి గౌరవించాలని వినమ్రంగా అభ్యర్ధిస్థున్నారు. ఈ చర్య ఉర్దూ సినిమాల్లోని కళాత్మకతకు గుర్తింపు ఇవ్వడమే కాకుండా, ఈ భాషలో పనిచేసే చిత్ర నిర్మాతలకు బలమైన ప్రోత్సాహంగా నిలుస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఉర్దూ సినిమా పరిశ్రమ అనేక ప్రశంసనీయమైన సినిమాలను అందించింది, ఇవి మన సమాజంలోని భాషా, సాంస్కృతిక, కళాత్మక సాంప్రదాయలను ప్రతి బింబించేలా చేసింది. ప్రసిద్ధ కళాకారులు అహ్సాన్ ఖాన్, అజీజ్ రిజ్వాన్ మరియు రాజు రాజేంద్ర ప్రసాద్ లు ఇటీవల ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ ను కలిసి ఉర్దూ సినీ పరిశ్రమ తరపున ఒక సమష్టి వినతిని సమర్పించారు. ఈ సమావేశంలో ఉర్దూ భాషా మీడియా మరియు సాంస్కృతిక కళల ప్రోత్సాహం కోసం ప్రభుత్వం నుండి గుర్తింపు, మద్దతు మరియు అభివృద్ధి అవసరమని వారు గుర్తు చేశారు. ఉర్దూ పరిశ్రమలోని కళాకారులు, సృష్టికర్తలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఈ ఉద్యమం ద్వారా గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి ఈ అంశం తీసుకెళ్లేలా చేయాలనే సంకల్పాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ న్యాయమైన ఉద్యమానికి మీరు మద్దతు తెలపాలని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా చేయాలని వినమ్రంగా అభ్యర్థిస్తున్నారు.

Related posts

Leave a Comment